కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై జిల్లా అధికారులు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జిల్లాలో 698 పల్లె ప్రకృతి వనాలు, 523 స్మశాన వాటికలు పూర్తి చేసినట్లు తెలిపారు. 526 నర్సరీలో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు చెప్పారు.
ఉపాధి హామీ పథకం కింద అత్యధిక పని దినాలు కల్పించిన మండలంగా మాచారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ద్వితీయ స్థానంలో గాంధారి ఉందన్నారు. జిల్లాలో 22 రైతు వేదికలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఫార్మేషన్ రోడ్డులు, ఉట చెరువుల నిర్మాణం, పూడికతీత పనులు, పంట కాలువలలో పూడికతీత పనులు చేసినట్లు అధికారులు వివరించారు.
కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్, డైరెక్టర్ ఆర్‌పి సింగ్‌లకు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోతే, డిఎఫ్‌వో నిఖిత, అధికారులు పాల్గొన్నారు.