జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులను వెంటనే కోవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి, రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ ఆర్ధిక సహాయంగా రూ. 10 లక్షల చొప్పున చెల్లించాలని టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్స్‌ సబ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, జిల్లా కార్యదర్శి అంగిరేకుల సాయిలు డిమాండ్‌ చేశారు.

శనివారం గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జర్నలిస్టుల జాతీయ నిరసన దినం పాటించారు. వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల రూపాయల బీమాపథకం వర్తింప చేయాలన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో తిరస్కరణకు గురవుతున్న హెల్త్‌ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా వెంటనే చర్యలు చేపట్టి, జర్నలిస్టుల ప్రాణాలకు భద్రత కల్పించాలని కోరారు.

మీడియాకు సంబంధించి కొత్త లేబర్‌ కోడ్‌ అమలులోకి వచ్చేంతవరకు వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ చట్టం అమలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలని, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో వర్కింగ్‌ జర్నలిస్టుల జాతీయ సంఘాల ప్రాతినిధ్యం తొలగించే యత్నాలను విడనాడాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అహ్మద్‌ ఆలీ ఖాన్‌, జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ కరోనా సాకుతో సిబ్బందిని అక్రమంగా తొలగిస్తున్న మీడియా సంస్థల యజమాన్యాలపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమానికి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, జిల్లా టి.ఎన్‌.జి.వోల సంఘం అధ్యక్షులు కిషన్‌, సిపీఐ నాయకులు ఓమయ్య, సుధాకర్‌, జిల్లా ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షులు బి.శేఖర్‌, జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు దేవిదాస్‌, గోవింద్‌ రాజు, మండే మోహన్‌, జి.ప్రమోద్‌, నరేందర్‌, రాజలింగం, సంజీవ్‌, రాజేశ్‌, గంగారెడ్డి, నరేంద్ర స్వామి, రాజ్‌ కుమార్‌, బైస సంగీత, సుదర్శన్‌, ఆర్మూర్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు మురళీ, అజీమ్‌, ఉర్దూ జర్నలిస్ట్‌ నాయకులు మాజీద్‌, అఫ్జల్‌ ఖాన్‌, ఎడపల్లి ప్రెస్‌ క్లబ్‌ నాయకులు రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »