నిజామాబాద్, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో పోరాడుతామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ సత్యం, ధర్మం, అహింస ఆయుధాలుగా చేసుకొని శాంతియుతంగా పోరాడినట్లుగానే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రీతం, సందీప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.