వేల్పూర్, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం నిర్వహణకు పిలుపు ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టుకు నిరసనగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ సూచన మేరకు ఆదివారం వేల్పూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసినట్టు వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీరడిభాగ్య తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి నేటికి ఏడేళ్ళు గడుస్తున్నా ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి ఇవ్వక విద్యార్థులను మోసం చేసిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. అక్రమ అరెస్టులు ఆపకుంటే గ్రామాల్లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, నాయకులను అడ్డుకుంటామని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్న ప్రభుత్వాన్ని తగిన సమయంలో బుద్ధిచెప్పాల్సిన అవసరం వస్తుందని, రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల సమయం ముందుందని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టులు చేయడం సిగ్గుచేటని హుజరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు.
హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కారు గుర్తుకు ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా సైనికుల్లా పని చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ దామోదర్ గౌడ్, మైనార్టీ మండల అధ్యక్షులు మజీద్, సీనియర్ నాయకులు నరేందర్, రమణ, ఇంద్ర గౌడ్, భజన, రామ్ చందర్, చిన్నయ్య, బావయ్య, ప్రవీణ్, రాజేందర్, మల్లేష్, మైలారం గంగారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.