బాన్సువాడ, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం వర్ని మండల కేంద్రంలో వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కవర్డ్ షెడ్, మీటింగ్ హాల్, స్టోర్ రూమ్, ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంక్, టాయిలెట్ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.
అనంతరం వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోటగిరి, రుద్రూరు, మోస్రా, చందూరు, వర్ని మండలాల మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఉమ్మడి వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మెన్ బందెలా సంజీవులు, వర్ని మండల ఎంపీపీలు మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, సుజాత నాగేందర్, జడ్పీటీసీలు హరిదాస్, నారోజి గంగారాం, భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిరి, పత్తి లక్ష్మణ్, హన్మంత్ రెడ్డి, వర్ని ముఖ్య కార్యదర్శి వెలగపూడి గోపాల్, ప్యాక్స్ చైర్మన్లు నామాల సాయి బాబా, కృష్ణా రెడ్డి, సంజీవ రెడ్డి, మాధవ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు నాని బాబు, వర్ని వైస్ ఎంపీపీ బాలరాజు, సర్పంచ్ పద్మా నాగభూషణం, శ్రీనగర్ రాజు, సాయి రెడ్డి, కో ఆప్షన్ కరీం, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.