వేల్పూర్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం సాహెబ్ పేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత చొరవతో తెలంగాణ సాంస్కృతిక పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత సంబరంగా జరుపుకుంటారని, అందుకు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లి ఖర్చుల కొరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అదేవిధంగా మహిళలకు ఉచిత డెలివరీతో పాటు ఆడబిడ్డ జన్మిస్తే 13 వేల రూపాయలు, మగ బిడ్డ జన్మిస్తే 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడమే కాకుండా కేసీఆర్ కిట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయని తద్వారా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌తో పాటు కార్యదర్శి పాలకవర్గం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.