రైతులను చంపడం అమానుషం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తుంటే బిజెపి ఎంపీ కొడుకు రైతులపై కారు ఎక్కించి రైతులను చంపడం జరిగిందని, నరేంద్ర మోడీకి ఏమాత్రం నైతికత ఉన్న మానవత్వం ఉన్న తన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని మానాల మోహన్‌ రెడ్డి అన్నారు.

బిజెపి ప్రభుత్వం రైతులు సంవత్సరకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో పోరాటం చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా గాడ్సే మార్గంలో ప్రయాణిస్తూ రైతులను చంపడం జరుగుతుందని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న జాతీయ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. బిజెపి నాయకుల అవినీతి అక్రమాలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుందని, ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్యక్రమంలో రూరల్‌ ఇన్చార్జి భూపతి రెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు పోరాటాలు చేస్తుంటే బిజెపి ప్రభుత్వం రైతులను అనచి వేయడం జరుగుతుందని, బిజెపి ఎంపీ కొడుకు రైతులపై కారు ఎక్కించి చంపడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తుందని, రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని భూపతి రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా అర్బన్‌ ఇంచార్జ్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బిజెపి నాయకులు ఎన్నో అరాచకాలు చేస్తున్నారని అన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో బిజెపి ఎంపీ కొడుకు కారు ఎక్కించి చంపిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళిన ప్రియాంక గాంధీ అక్రమ అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీమహిళా అధ్యక్షురాలు నీరెడీ భాగ్య, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్‌, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ, జిల్లా ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షులు వేణు రాజు, పీసీసీ కార్యదర్శి రాంభూపాల్‌, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోల ఉషా, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి కోనేరు విజయలక్ష్మి, నగర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు ప్రీతం, నగర మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్‌ ఏజాజ్‌, నగర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు మటం రేవతి, జావిద్‌ అక్రమ్‌, పిసిసి మెంబర్‌ ఈసా, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, నరేందర్‌ గౌడ్‌, ప్రమోద్‌, నరేంద్ర సింగ్‌, భాస్కర్‌, శోభన్‌, శుభం, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »