నిజామాబాద్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రభుత్వం కార్మిక శాఖ ఇటీవల ప్రారంభించబడిన రెండు లక్షల ఇన్సూరెన్స్‌ను అసంఘటిత కార్మికులు ఉపయోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రగతి భవన్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, ఈ పోర్టల్లో అసంఘటిత కార్మికులు అందరూ తమ పేర్లను రిజిస్టరు చేసుకోవాలని ఆయన కోరారు.
ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి రాని నిరుపేదలు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. పీఎఫ్ సౌకర్యం, ఈఎస్‌ఐ సౌకర్యం లేని వారు అర్హులన్నారు. తమ పేర్లను రిజిస్టర్ చేసుకో వడానికి మీ-సేవ కేంద్రాలను సంప్రదించవచ్చన్నారు. వీరికి రెండు లక్షల బీమా ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు.