వేల్పూర్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కుకుకునూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎ.జి.లీ.టి. సంస్థప్రతినిధులు విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు వితరణ చేసినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను, పెన్నులు, పెన్సిల్లు ఏ.జీ.లి.టి. సంస్థ ప్రతినిధులు అందజేశారని, వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థులు కూడా మంచి చదువులు చదివి పాఠశాల పేరుతో పాటు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గటడి శ్రీనివాస్, కే. మహేందర్, సాయిలు, మోహన్, అశోక్, కృష్ణ, రవీందర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లింబాద్రి, గ్రామ కార్యదర్శి రాజారాం, సంస్థ ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.