నారాయణఖేడ్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగులో ఉన్న స్కాలర్ షిప్ ఫీ రేయింబర్మెంట్ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖేడ్ ప్రభుత్వ కళాశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి స్కాలర్ షిప్, ఫీ రేయింబర్మెంట్ పెండిరగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యార్థులకు ఫీజులు రాక ఇతరత్రా పనులు చేసుకొని చదువు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో ఖాళీలు ఉన్నవి వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పెండిరగ్ ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు శీను, రాహుల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.