ఆర్మూర్, అక్టోబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్, సిక్కుల కాలనీలలో రోడ్డుకు ఇరువైపుల వున్న డ్రైనేజీలలో, మురికి గుంటలలో దోమలను వాటి గుడ్లను (లార్వా) లను అంతం చేయడానికి ప్రాచీన పద్దతిలో ఆయిల్ బాల్స్ వేశారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలలో మురికి గుంటలలో మురికి నీరు నిలువ లేకుండా చూడాలని కోరారు. ఆయిల్ బాల్స్ వల్ల దోమలు వాటి గుడ్లు నశిస్తాయన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, కోశాధికారి గొనె శ్రీధర్, కార్య నిర్వహణ కార్యదర్శి బెతు గంగాధర్, తులసి పట్వారి, ఖాందేష్ సత్యం, మీరా శ్రావణ్ సంస్థ సభ్యులు ఖొడే శ్రీనివాస్, విష్ణు, సురేష్, సంజీవ్, స్వామి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.