మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండలం రామ్‌ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్యకు తెలియజేయగానే ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి లావణ్య ఎంతో ఆదర్శమని లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ 35 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రక్తదానం చేయడం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. గతంలో కూడా 5 సార్లు రక్తదానం చేశారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆపద సమయంలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన లావణ్యను అభినందించారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందన్‌, రాజు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »