బోధన్, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలో అన్నీ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెం 60 లో పేర్కొన్న ప్రకారం వారి వేతనాలను పెంచి, జూన్ నెల నుండి కొత్త వేతనాలను అమలు చేసి, బకాయిలతో సహా చెల్లించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలో పని చేస్తున్న ఎన్‌ఎమ్‌ఆర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పార్ట్ టైమ్, పుల్ టైమ్ సిబ్బందితో పాటు స్కీం వర్కర్లకు 30 శాతం పీఆర్‌సిని పెంచి ఇస్తున్నదని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కార్మికులకు మాత్రం ఇవ్వక పోవడం అన్యాయం అన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వానికి అనేక వినతిపత్రాలు ఇచ్చామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బి.మల్లేష్ మండిపడ్డారు. ఇప్పటికైనా కార్మికులకు జీవో నెం 60 ప్రకారం పెంచి, జాన్ నుండి బకాయిలతో సహా చెల్లించాలని, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.గంగామని, పోచయ్య, గంగారాం, భూమయ్య, శంకర్, దర్శనం, ఖాజీమ్, సాయులు, రాజు తదితరులు పాల్గొన్నారు.