కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బిక్కనుర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల ప్రక్కన, నిజామాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు నుండి ఒక వ్యక్తి పడిపోవడంతో 108 కు కాల్ చేశారు.
సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని, గాయపడిన సంపంగి కుమార్ (35) యనంపల్లి గ్రామం, డిచ్ పల్లి మండటానికి చెందిన వ్యక్తి తలకు గాయమై, కాలు విరిగి తీవ్ర రక్త స్రావం కావడంతో, ప్రాథమిక చికిత్స చేసి, ఒక కిలోమీటర్ దూరం నుండి అతనిని స్టేచర్పైన అంబులెన్స్ వరకు తీసుకొని వచ్చి, హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, 108 సిబ్బంది ఈఎంటీ సురేష్, పైలట్ సుదర్శన్ గౌడ్ తెలిపారు.