నిజామాబాద్, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రజలశక్తి అదనపు కార్యదర్శి, నిజామాబాద్ పూర్వ పాలనాధికారి అశోక్‌కుమార్, నిజామాబాద్‌లో పలు అధికారిక కార్యక్రమంలో పాల్గొని రెడ్ క్రాస్ భవనాన్ని ఆత్మీయంగా సందర్శించారు.
రెడ్ క్రాస్ భవనంతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు. నిజామాబాద్ రెడ్ క్రాస్ సేవలకు మొత్తం మన దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని అభినందించారు. రెడ్ క్రాస్ ఈ స్థాయికి రావడానికి కారణమైన జిల్లా చైర్మన్ నీలి రాంచందర్, కార్యదర్శి బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవిందర్, డాక్టర్ రామ్మోహన్ రావు, పోశయ్యలను అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, ట్రైని కలెక్టర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.