గడప గడపకు చట్టాలపై అవగాహన

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, కొరట్‌పల్లి, కొరట్‌పల్లి తాండాలలో గడపగడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు న్యాయ సేవా అధికార సంస్థ న్యాయవాది జగన్మోహన్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాన్‌ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన గడపగడపకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగ సాధ్యమైనంత వరకు ప్రజల వాడుక భాషలోనే అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

ప్రతి వ్యక్తి చట్ట పరిజ్ఞానం పొంది ఉండాలని తెలిపారు. పోక్సోచట్టం, లోక్‌ అదాలత్‌, ఉచిత న్యాయ సేవలు వివిధ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామాల్లో ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీ, ఇంటింటికి న్యాయ అవగాహన కరపత్రాల పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కోరట్‌పల్లి సర్పంచ్‌ శ్రీజ, ఇందూరు యువత అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ మద్దుకూరి సాయిబాబు, స్వర్ణలత, బాబు, గణేష్‌, మీనా, కోరట్‌ పల్లి తాండా పంచాయతీ కార్యదర్శి దివ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రపంచ కప్‌ స్కేటింగ్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీకి శాంతాపూర్‌ క్రీడాకారిణి

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »