కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కేంద్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆరోగ్య కేంద్రాల వారిగా వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కోరారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.