బాన్సువాడ, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్ గేమ్స్ ఛాంపియన్ షిప్ 2021 గోవాలో జరగనున్న ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్సువాడ క్రీడాకారులకు 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందజేశారు.
తెలంగాణ నుండి ఎంపికయిన కామారెడ్డి జిల్లా బాల, బాలికల జట్టులో బాన్సువాడ క్రీడాకారులు ఉండడంతో వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న పోచారం భాస్కర్ రెడ్డి వారు గోవా వెళ్ళడానికి ఆర్థిక సహాయం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వార అందించారు.
ఈ సందర్బంగా క్రీడాకారులు భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.