కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని తన చాంబర్‌లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ప్రతి గ్రామపంచాయతీలో 35 శాతం కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం నాలుగు చోట్ల స్థలాలను ఎంపిక చేయాలని తహసిల్దార్‌లను ఆదేశించారు.
ఫార్మేషన్ రోడ్డు, కందకాల వంటి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఏపిడి సాయన్న, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.