కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో మంజూరైన కళ్యాణలక్మి, షాదిముబారక్‌ చెక్కులు పంపిణి చేసినట్లు గ్రామ సర్పంచ్‌ రాజేశ్వర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంలో భాగంగా మంజూరైన చెక్కులను గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు అందజేశామని, ఇందుకోసం కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఎంపిటిసి గంగామణి, తెరాస పార్టీ అధ్యక్షుడు నగరం మహేందర్‌, దాసరి సాగర్‌, ఎల్కపల్లి మహేష్‌, స్వామిగౌడ్‌, ఎల్లోళ్ల గంగాధర్‌, దర్శనం రాజు తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »