ఆర్మూర్, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద జై భీం సేన అధ్యక్షులు పింజ అశోక్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరాం 15 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పింజ అశోక్ మాట్లాడుతూ కాన్షిరాం గారు 15 మార్చి 1937 లో జన్మించారని, ఓట్లు మావి రాజ్యం మీదా అనే నినాదంతో ఇంత కాలం పాలితులుగా ఉన్నామని ఇకనుండి పాలకులుగా మారుదామని, కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అని బహుజనులను చైతన్య పరిచారన్నారు. రాజకీయాల్లో సాటిలేని మేటి యోధుడు కాన్షిరాం అని కొనియాడారు.
కార్యక్రమంలో పులి యుగంధర్, మాలమహనాడు నాయకులు పింజ పెద్ద బోజన్న, ముగా ప్రభాకర్, షెట్పల్లి నారాయణ, ఆర్గులు సురేష్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.