ఆర్మూర్, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ పోస్ట్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు పోస్టు కార్డుల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పోస్ట్ కార్డులపై ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలకు ధన్యవాదాలు వ్రాసి ఆర్మూర్ తపాలా కార్యాలయానికి వెళ్లి పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతు భారత ప్రధాని ఈ ఏడు సంవత్సరాల కాలంలో భారత దేశ అభివృద్ధికై ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అనే లక్ష్యంతో బడుగు బలహీన, పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, జీవన జ్యోతి బీమా యోజన, జన్ ధన్ ఖాతా యోజన, ఆవాస్ యోజన పథకాలు, అదేవిధంగా ఆడపిల్లల విషయంలో సుకన్య సమృద్ధి యోజన, భేటీ బచావో- భేటీ పడావో యోజన, అదేవిధంగా వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్ యార్డ్‌ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, సిసి రోడ్ల, సైడ్ కాలువల నిర్మాణం వంటి వాటి కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, యువకుల చిరు వ్యాపారం కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన అదేవిధంగా కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఉచిత టీకాల పంపకం, దీపావళి వరకు రేషన్ షాప్‌లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం పథకం లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన మోడీకి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్తరాలు వ్రాసి పోస్ట్ చేశామని తెలిపారు.
కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, నిజామాబాద్ పార్లమెంట్ దళిత మోర్చా కన్వీనర్ నల్ల రాజారాం, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు శ్యామ్‌గౌడ్, కార్యదర్శి ఖాందేశ్ ప్రశాంత్, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, గిరిజన మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు కొర్ర గంగాధర్, భూపేందర్, ప్రసాద్ బిజెపి, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.