డిజెఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చుక్క గంగారెడ్డి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెమోక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌కు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సీనియర్‌ జర్నలిస్ట్‌, తెలంగాణ ఉద్యమకారులు, సామాజికవేత్త, హక్కుల నేత, ఆర్టీఐ కార్యకర్త అయిన చుక్క గంగారెడ్డిని నియమించినట్లు డిజెఎఫ్‌ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటపల్కుల వెంకట్‌ సోమవారం ప్రకటించారు.

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామానికి చెందిన చుక్క గంగారెడ్డి చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, ఆయన కృషి, పట్టుదల, ఆయన సేవలను గుర్తించి జాతీయ కార్యవర్గం తో పాటు రాష్ట్ర కార్యవర్గం సూచనల మేరకే డిజెఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ యొక్క కార్యక్రమాలను, నియామకాలను అధికారకంగా ప్రకటించే బాధ్యతలు చుక్క గంగారెడ్డికే అప్పగించడం జరిగిందని వారు సూచించారు.

ఈ సందర్బంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ తన కృషిని గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన పదవిలో నియామకం జరిపిన కేంద్ర, రాష్ట్ర కమిటీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి షఫీ ఉల్లాఖాన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు బొల్లే పెళ్లి కిషన్‌, మాసం రత్నాకర్‌ లతో పాటు ఇతర కార్యవర్గం అందరికీ చుక్క గంగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈయన నియామకం పట్ల రాష్ట్ర కార్యవర్గం, వివిధ జిల్లా కమిటీల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »