ఆర్మూర్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లో ఎల్ఐసి ఏజెంట్ల నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా జోనల్, డివిజన్ నాయకులు, ఆర్మూరు బ్రాంచ్‌కు సంబంధించిన దాదాపు 150 మంది ఏజెంట్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరై ఏజెంట్ల సమస్యలు, పాలసీదారుల నూతన పాలసీలు తదితర విషయాలు చర్చించారు.
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో భారతీయ జీవిత బీమా సంస్థల్లో 34 కోట్ల పాలసీదారులతో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్థగా భారతీయ జీవిత బీమా సంస్థ ఉందని గుర్తు చేశారు.
నూతనంగా ఏర్పడ్డ అధ్యక్షులు వన్నెల్ దాస్ రాము, ప్రధాన కార్యదర్శి డి బాలయ్య, కోశాధికారి శరత్ చంద్ర గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎస్బి శ్రీనివాస్ చారి, డివిజన్ అధ్యక్షులు వెంకటయ్య, జోనల్ ఐటీ చైర్మన్ డి సునీల్ కుమార్, జోనల్ అడ్వైజర్ కమిటీ ఫణీంద్ర, జోనల్ నాయకులు, తిరుపతి రెడ్డి గంగాదాస్, సాయన్న, పూల శ్రీనివాస్, తుంపల్లి శ్రీనివాస్, ఆర్ట్స్ ముత్యం, గణేష్, నాగేశ్ రెడ్డి చందర్, శంకర్, నవీన్, నరేందర్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.