కామారెడ్డి, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట మాధవరావుకి ఫిర్యాదు చేసినట్టు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యార్థులకు కావలసిన డ్యూయల్ డిస్క్ బెంచీలు, అదనపు తరగతి గదులు లేకపోవడంవల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొనసాగాల్సిన కళాశాల కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే కొనసాగడం జరుగుతుందని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు, ఫర్నిచర్ వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చెట్టబోయిన స్వామి పాల్గొన్నారు.