నిజామాబాద్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సమావేశంలో ఎస్సీలకు 12 అనుమతులు ఇవ్వగా అందులో ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వెహికల్స్ 8, గూడ్స్ కారియర్స్ 2, మోటార్ క్యాబ్ 2 ఉన్నాయి. ఎస్‌టిలకు 13 మంజూరు చేయగా, మోటార్ క్యాబ్స్ 2, ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వెహికల్స్ 9, గూడ్స్ కారియర్స్ 2 ఉన్నాయి. యూనిట్ మంజూరు చేయుటకు 35 శాతం సబ్సిడీ అందించుటకు ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు. ఇప్పటికీ 1252 అనుమతులకు దరఖాస్తు చేసుకోగా 995 అనుమతులు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా జారీ చేయడం జరిగిందని ఆ శాఖతో పాటు రవాణా, పొల్యూషన్ కంట్రోల్, ఇతర శాఖల అనుమతులు కూడా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలో జారీ చేయుటకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మరోవైపు ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించాలని ఆయన ఆదేశించారు.
సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్, డిఆర్డీఓ పిడి చందర్ నాయక్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాబురావు, ఎల్‌డిఎం శ్రీనివాస్ రావు, పిసిబి ఈఈ బిక్షపతి, యస్‌సి కార్పొరేషన్ ఈడి రమేష్, యస్‌టి కార్పొరేషన్ నగోరావు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.