కామారెడ్డి, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతిలో చేపట్టిన కంపోస్ట్ షెడ్లు వినియోగించి పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం ఆయన గాంధారి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వైకుంఠ ధామాలు అన్ని గ్రామాల్లో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఊట చెరువుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్ సంజీవ్, అధికారులు పాల్గొన్నారు.