Daily Archives: October 13, 2021

అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని లింగంపెట మండలం, రామయిపల్లి తండాకు చెందిన వనితకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌ సేవల కోసం ఫోను చేయగా .. దేవశోత్‌ వనిత (18) ని, లింగంపేట (పి హెచ్‌ సి.) ప్రభుత్వ ఆసుపత్రి నుండి రిఫర్‌ చేయడంతో.. కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమెకి పురిటి నొప్పులు అధికం అయ్యాయి. దీంతో అంబులెన్స్‌లో సుఖ …

Read More »

రోజు వారి లక్ష్యాలు పూర్తయ్యేలా చూడాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సంఘాల మహిళలు సహకారం తీసుకుని గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయాలని …

Read More »

మెడికల్‌ కళాశాల కోసం స్థల పరిశీలన

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం కోసం 40 ఎకరాల స్థలాన్ని బుధవారం ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. అనంతరం ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వైద్యశాఖ, ఎంపీవోలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ చేయాలని సూచించారు. వైద్య సిబ్బందికి, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సహకారం అందించాలని కోరారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బంది …

Read More »

పకడ్బందీగా ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 నుండి నిర్వహించే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు అన్ని ముందస్తు ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో పరీక్షలపై సంబంధిత అధికారులతో ఏర్పాట్ల కొరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్‌ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో మొదటి …

Read More »

పడగల్‌లో ఘనంగా బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవాలు

వేల్పూర్‌, అక్టోబర్ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో తెలంగాణ సాంస్క ృతిక పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు, పిల్లలు రోజుకో తీరుగా బతుకమ్మ ఆడుతూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం 40 మంది మహిళలలు బతుకమ్మను పేర్చి చక్కని కోలాటం ఆటపాటలతో అందరినీ అలరించారు. …

Read More »

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి తధ్యం

కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ అసమర్థ పాలన వల్ల 200ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడం కేసీఆర్‌ తుగ్లక్‌ పాలనకు నిదర్శనమని, రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే నోటిఫికేషన్లు వెయ్యకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అని హుజురాబాద్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను …

Read More »

నిజాంపూర్‌ లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నవీపేట్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని నిజాంపూర్‌ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన సామూహిక కుంకుమ అర్చన, హోమం, పంచాభిషేకాలతో ప్రతేక్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహా బిక్ష, అన్నదానం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ యూత్‌ సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి సేవలో గ్రామ ప్రజలు, యూత్‌ …

Read More »

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

బోధన్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరుగాలం కష్ట పడి పండిరచిన పంటలకు ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రయివేట్‌ దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోతున్నారని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసి బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి కే. గంగాధర్‌ అన్నారు. తుపాన్‌ మూలంగా భారీగా కురిసిన వర్షాలతో పంటలన్ని నీట మునిగాయని అలా నష్టపోయిన రైతులు పంటను నూర్పిడి చేసి …

Read More »

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగా పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »