అంబులెన్స్‌లో ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, అక్టోబర్ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని లింగంపెట మండలం, రామయిపల్లి తండాకు చెందిన వనితకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌ సేవల కోసం ఫోను చేయగా .. దేవశోత్‌ వనిత (18) ని, లింగంపేట (పి హెచ్‌ సి.) ప్రభుత్వ ఆసుపత్రి నుండి రిఫర్‌ చేయడంతో.. కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమెకి పురిటి నొప్పులు అధికం అయ్యాయి. దీంతో అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు.

మొదటి కాన్పులో మగబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డిలో చేర్పించినట్లు 108 సిబ్బంది తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందించి ప్రసవం చేసిన సిబ్బంది, ఈఎంటి. అరవింద్‌, పైలట్‌. సంగాగౌడ్‌లను ఆమె భర్త గణేష్‌, కుటుంబ సభ్యులు అభినందించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »