కామారెడ్డి, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణం కోసం 40 ఎకరాల స్థలాన్ని బుధవారం ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అనంతరం ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు.
పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.