భీమ్గల్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్టకి శనివారం రోజు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుండి భక్తుల తాకిడి ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ తెలుగు సినీ పరిశ్రమల నిర్మాత దిల్ రాజు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని మర్యాద పూర్వకంగా శాలువా కప్పి ఆహ్వానించారు.
స్వామి వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు స్వామి వారి దర్శనం కొరకు బరికేడ్ల మధ్య క్యూలో వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు గంట నుండి గంటన్నర సమయం పట్టింది. అనంతరం భక్తులు స్వామి వారిని కోరికలు నెరవేరాలని పూజలు నిర్వహించారు.