వేల్పూర్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా బెదిరింపు చర్యలు చేపడుతూ మానసికంగా దెబ్బతీస్తున్నారని రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో ఎంపి అర్వింద్ ఇటీవల కురిసిన అధిక వర్షాల వలన వాగు పరివాహ ప్రాంతాన్ని భూములు కోల్పోయిన రైతులను కలవడానికి పరామర్శించడానికి పచ్చల నడుకుడలో పర్యటించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కేవలం చెక్ డాం కమీషన్ల కోసమే 8 ఫీట్‌లు కలిగిన డిజైన్ను 12 ఫీట్లు చేయడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందని, వ్యవసాయ అధికారి ఏవోల ద్వారా అధికారికంగా కేవలం 2 వేలు, 3 వేలు రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని, దాదాపు 400 ఎకరాలు కలిగిన భూమి రామన్నపేట, వేల్పూర్ పచ్చల నడుకుడ, మోతే, గ్రామాల్లో నష్టపోయిన రైతుల్ని కలువ నీయకుండా అడ్డుకుంటూ మహిళా రైతులను, రైతులను బెదిరిస్తూ ఎవర్ని ఏ పార్టీని కలవకూడదని కలిస్తే ఇబ్బంది జరుగుతుందని పోలీసు యంత్రాంగం ద్వారా బెదిరింపు చర్యలు చేపట్టడం జరిగిందని పరోక్షంగా తెరాస ప్రభుత్వాన్ని విమర్శించారు.
అటుగా మోతే వెళుతూ పచ్చల నడుకుడ గ్రామం మార్గమధ్యలో టీ తాగుతూ టీ పెట్టె సచిన్ అనే హోటల్ నిర్వాహకుడు వ్యక్తిని ప్రశంసించారు. మోతే గ్రామాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేవలం తమ తెరాస పార్టీ ప్రచారానికి వాడుకొని గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేపట్టడం లేదని ఎటువంటి అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. ఎంపి వెంట బాల్కొండ నియోజకవర్గ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, మల్కనగారి మోహన్ తదితరులున్నారు.