దోమకొండ, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపీట్ మండలం యాడారం గ్రామానికి సంబంధించిన 28 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో రమణారెడ్డికి స్వాగతం పలికిన కార్యకర్తలు పెద్దమ్మ గుడిలో పూజల అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ పని చేసే కార్యకర్తలను పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందని నియోజకవర్గంలో గ్రామ గ్రామాన యువకులు మోదీ ప్రభుత్వ పథకాలకు, బీజేపీ సిద్దంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభమైందని హుజురాబాద్ ఎన్నికలలో ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడమే లక్ష్యమని దాని కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుండే అధికార తెరాస ఆరాచకాలను ఎండగట్టడమే కాకుండా మోదీ పథకాలను ఇంటింటికి వివరించాలన్నారు.