ఫుట్‌బాల్‌ విజేత తమిళనాడు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఐదు రోజులుగ నాగారంలోని రాజారం స్టేడియంలో నిర్వహిస్తున్న వహీద్‌ మెమోరియల్‌ ఇన్విటేషన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ మ్సాచ్‌ లు ముగిసాయి. ఫైనల్‌ పోటీలో పోటీలో తమిళనాడు, కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ మధ్యన పోటీ ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగింది.

మ్యాచ్‌ మొదటి భాగంలో తమిళనాడు రెండు గోల్స్‌ సాధించి ఆధిక్యం కొనసాగించింది. ద్వితీయార్దంలో కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అత్యద్భుతంగా పోరాడి తమిళనాడు ఆధిక్యాన్ని నిలవరించింది. ద్వితయార్ధంలో తమిళనాడు మరొక గోల్‌ సాధించడతో తమిళనాడు ఆధిక్యం 3-0 కు పెరిగింది. చివరికి తమిళనాడు 3-0 తో గెలిచి తొలి వహీద్‌ మెమోరియల్‌ జాతీయ ఇన్విటేషన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ విజేతగా నిల్చింది.

ఉదయం వర్షంతో మైదానము బురదమయంగ మారడంతో మూడవ స్థానానికి పోటి నిర్వహించలేక పోవడంతో హైదరాబాద్‌ తెలంగాణ జట్టును, కేరళ జట్టును ఉమ్మడి విజేతలుగ ప్రకటించారు. నేటి ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా ధ్యాన్‌ చంద్‌ అవార్డు విజేత, భారత ఫుట్‌బాల్‌ మేనేజర్‌, భారత దేశ మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు శబ్బీర్‌ అలీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసారు.

రన్నరప్‌గా నిలిచిన ఫుట్‌బాల్‌ అకాడమీ జట్టుకు రాష్ట్ర ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బహుమతిని అందజేశారు మూడో స్థానం వచ్చిన హైదరాబాద్‌ తెలంగాణ జట్టుకు అథ్లెటిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నరాల రత్నాకర్‌, నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శఖీల్‌ బహుమతులు అందజేశారు. అదేవిధంగా మూడో స్థానం వచ్చిన మరొక జట్టు కేరళకు మాజీ డిప్యూటీ మేయర్‌ ఫహీమ్‌, నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఖలీల్‌ బహుమతులు అందజేశారు. ఈనాటి ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా భారత దేశ ఫుట్‌బాల్‌ సమాఖ్య మేనేజర్‌ షబ్బీర్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు షకీల్‌ ఖలీల్‌, కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్‌, ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆంద్యాల లింగం, సుబ్బారావు, సాయగౌడ్‌, గిరి, ప్రశాంత్‌, ఫారుక్‌, ఎజాజ్‌, అన్వర్‌, జావేద్‌, ఖాలేద్‌, అశ్వాక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »