నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కాన్షిడరేషన్ ఆఫ్ వుమెన్ ఆంత్ర పోసర్స్ వారి ఆద్వర్యంలో ఈనెల 21 వతేది నుంచి ప్రారంభం కానున్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో అడ్వాన్స్ వెల్డర్, ఇండస్ట్రియల్ పెయింటర్, హౌస్ కీపర్, కామేస్ షేఫ్, మెడిసినల్ ప్లాంట్ గ్రోవర్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
శిక్షణ 1 నుంచి 3 నెలల పాటు ఉంటుందని, శిక్షణ అనంతరం ఉద్యోగ కల్పన కూడా ఉంటుందన్నారు. కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుందని, అర్హత వయసు 18సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు, కనీస విద్యార్హతలు ఇతర వివరాల కోసం శిక్షణ నిర్వాహకురాలు డా. రాణిని సంప్రదించాలన్నారు.
సెల్ నెంబర్ 9849804204, నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌లో కూడా మీ పేరు, వివరాలు నమోదు చేయించుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్ నెంబర్‌లో 9717219538, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే సంప్రదించి, పేరు నమోదు చేసుకోవాలని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.