కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కార్యాలయాలలో రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం స్వఛ్ఛ డ్రైవ్‌లో భాగంగా పలు కార్యాలయాలను సందర్శించారు. సెల్ఫ్‌లో రికార్డులు భద్రంగా పెట్టాలని సూచించారు.
కార్యాలయాల్లో ఉన్న అవసరం లేని పేపర్లను తొలగించాలని పేర్కొన్నారు. చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల ఒకరోజు స్వచ్ఛత డ్రైవ్‌ను ఉద్యోగులు నిర్వహించాలని కోరారు. జిల్లా ఉపాధి కల్పన, బీసీ వెల్ఫేర్, ఎస్సి వెల్ఫేర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ, వ్యవసాయ, సహకార, జిల్లా వైద్య, రెవిన్యూ, మహిళ, శిశు, వయోవృద్ధుల శాఖ కార్యాలయాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు ఉన్నారు.