నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ వినాయక్‌నగర్‌లో గల బస్వాగార్డెన్స్‌లో ఈనెల 21న గురువారం ఉదయం నుంచి బ్యాంకు రుణ మేళా నిర్వహిస్తున్నట్టు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
లీడ్‌బ్యాంక్ (ఎస్‌బిఐ) ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, గ్రామీణ, సహకార బ్యాంకుల సమన్వయంతో ఇట్టి మేళా నిర్వహిస్తున్నామన్నారు.
బ్యాంకుల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ ప్రాయోజిక పథకాలైన ముద్ర, పిఎం స్వనిధి, స్టాండప్ ఇండియా, అగ్రి ఇన్ ఫ్రా, పిఎం ఇజిసి, మహిళా స్వయం సహాయక రుణాలు, గృహ ఋణాలు, వాహన రుణాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారికి తక్షణమే రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ప్రజలు రుణ మేళాలో పాల్గొని బ్యాంకులు అందిస్తున్న ఋణ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.