ఏ గ్రేడ్‌ ధర రూ. 1960, కామన్‌ వెరైటీ రూ. 1940

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అవసరమైన నిబంధనతో ఉత్తర్వులు జారీ చేసినందున అందుకు సంబంధించి అధికారులు జిల్లాలో 458 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయుటకు అన్ని ముందస్తు ఏర్పాటు చేయాలని సదుపాయాలు సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి సందర్భంగా అధికారులతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం లాగే కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ఆయా శాఖలకు సంబంధించిన సంబంధిత సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చినందున వారికి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సదుపాయాలు గన్ని బ్యాగులు, తూకం కాంటాలు, టార్పాలిన్లు, ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు, చెన్ని మిషన్లు అన్ని కొనుగోలు కేంద్రాలకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అదేవిధంగా తూనికలు కొలతల శాఖ అన్ని కొనుగోలు కేంద్రాలలో క్రయ విక్రయాలు పారదర్శకంగా జరిగే విధంగా తూకంలో రైతులకు నష్టం జరగకుండా అదేవిధంగా రైస్‌ మిల్లు వద్ద కూడా రైతులకు నష్టం జరగకుండా రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయాలని ఎట్టి పరిస్థితుల్లో రైస్‌ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పర్యవేక్షణ, తనిఖీలు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు ధాన్యం రవాణాకు అవసరమైన లారీల కాంట్రాక్టర్లతో మాట్లాడి రవాణాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులు తీసుకువచ్చే ఎఫ్‌ఏక్యూ కలిగిన ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాలుకు రూ.1960, కామన్‌ వెరైటీకి రూ.1940 రైతులకు చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు తప్పనిసరిగా 17 శాతం లోపు తేమ కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన సూచించారు. ఇందులో తేమ-తాలు 1శాతం, మట్టిపెళ్లలు ఒక శాతం, చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన, పురుగులు తిన్న ధాన్యం ఐదు శాతం, పూర్తిగా తయారుకాని, ముడుచుకుపోయిన ధాన్యం మూడు శాతం, తక్కువ రకాల మిశ్రమం ఆరు శాతం కలిపి 17 శాతానికి మించకుండా చూసుకోవాలని ఆయన రైతులను కోరారు.

కోత సమయంలో కోత మిషన్‌లో హై స్పీడ్‌ 18 నుండి 20లోపు అడ్జస్ట్‌ చేయడంవల్ల నాణ్యమైన ధాన్యం రావడానికి వీలు ఉంటుందని ఆయన సూచించారు. తేమ శాతం 20 లోపు ఉన్నప్పుడు కోతలు కోయాలని ఆయన తెలిపారు. ధాన్యం తీసుకొచ్చే సమయంలో రైతులు వారి వెంట బ్యాంకు పాస్‌ బుక్‌, పట్టాదారు పాసు బుక్కు, ఆధార్‌ కార్డు, ఒకవేళ కౌలు రైతులు అయితే కౌలునామా పత్రం జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు జారీచేసిన టోకెన్‌ ప్రకారమే ఆ తేదీన ఆ సమయానికి ధాన్యాన్ని తీసుకు రావాలని కొనుగోలు కేంద్రంలో కాంటా చేసే వరకు ధాన్యం వర్షానికి తడవకుండా ఇతర కారణాల వల్ల నష్టం జరగకుండా రైతులు జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు, మండల స్థాయి అధికారులు రైతులకు అవసరమైన సూచనలు చేయడానికి అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన కోరారు.

ఈనెల 20న ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాస్థాయి సమావేశం జరుగుతుందని, 21, 22న గ్రామ, మండల స్థాయి అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సహకార సంఘాల చైర్మన్లు జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు జరిగినన్ని రోజులు రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు.

రైస్‌ మిల్లర్లు కడ్తా పేరుతో రైతుల వద్ద అధిక ధాన్యాన్ని తీసుకున్నా, హమాలీలు అధిక చార్జీలు వసూలు చేసినా, లారీ డ్రైవర్లు అదనపు చార్జీలు వసూలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఎక్కడైనా సమస్యలు ఎదురైతే రైతులు 18004256644 టోల్‌ ఫ్రీ నెంబరుకు గాని, 08462221085 పౌరసరఫరాల శాఖ నంబరుకు గాని కాల్‌ చేయాలని ఆయన సూచించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, డిసిఓ సింహాచలం, డిసిఎస్‌ఓ వెంకటేశ్వరరావు, డిఏఓ గోవింద్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »