కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్‌లో జరిగిన స్టేట్ సీనియర్ ఇంటర్ జిల్లాల రగ్బీ టోర్నమెంట్‌లో కామారెడ్డి జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు తేవడం అభినందనీయమని కొనియాడారు.