నిజామాబాద్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అంటే ధాన్యసిరులకి పెట్టింది పేరు. కొన్ని వేల హెక్టార్లలో అన్నదాతలు ధాన్యాబాండాగారాన్ని పండిస్తున్నారు. అయితే గత వారం పది రోజుల నుండి వరికోతలు ప్రారంభమవ్వడంతో అన్నదాతలు కోతలతో బిజీ అయ్యారు. కోసిన వడ్లు రోడ్లపై ఆరబెట్టడంతో ఇటు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి సమయాలలో రోడ్డుపై పోసిన వడ్లధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని పులువురు పేర్కొన్నారు. ఇకనైనా అన్నదాతలు స్పందించి విశాలమైన మైదానాలలో వరి ధాన్యాన్ని ఆరబోసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.