మహాత్మా! జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యు.ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఓ మహాత్మా ! జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండని కోరారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణురాజు మాట్లాడుతూ జిల్లాకు తలమానికంగా ఉన్న డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీలో అక్రమనియామకాలు, కోట్లల్లో అవినీతి జరుగుతున్నా జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మౌనం వెనుక ఆంతర్యమేమిటి అని ఎన్‌.ఎస్‌,యు.ఐ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు.

గత 45 రోజులుగా విద్యార్థి సంఘాలు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాలు 130 మందికి పైగా భర్తీ చేశారని అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మీడియాలో పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నప్పటికీ జిల్లాకు సంబంధించిన మంత్రి, ప్రజాప్రతినిధి నిమ్మకు నీరెత్తినట్లు వేముల ప్రశాంత్‌ రెడ్డి మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యమేమిటని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణు రాజు ఆరోపించారు.

పెద్ద ఎత్తున తెలంగాణ యూనివర్సిటీ లో అక్రమాలు జరిగాయని ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా ఇంతవరకు జిల్లా మంత్రి స్పందించకపోవడం చాలా దారుణం అని జిల్లా ప్రజా ప్రతినిధులు సైతం ఒక్కరు కూడా స్పందించడం లేదు, స్పందించక పోవడం వెనుక కారణాలేమైనా ఉన్నాయా..? జరిగిన అక్రమ నియామకాల్లో తమ వాటా ఏమైనా ఉన్నాయా అందుకోసమే ఎవరూ నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎన్‌.ఎస్‌.యు. ఐ. ప్రధాన కార్యదర్శి వేదమిత్ర, ప్రశాంత్‌, శివ, శశి, రిషి, శ్రావణ, భార్గవ్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »