కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ, రెవిన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్ భూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ధరణిలో పెండిరగ్ లేకుండా చూసుకోవాలని కోరారు. మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం బీర్కూర్, దోమకొండ, నసురుల్లాబాదులో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఎఫ్‌వో నిఖిత, ఆర్‌డిఓ రాజాగౌడ్, ఏవో రవీందర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.