నిజామాబాద్, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి మండల కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి 51 మంది లబ్ధిదారులకు రూ.51,05,916 విలువ గల చెక్కులతో పాటు లబ్ధిదారులు ప్రతిఒక్కరికి చీరను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రం అందించడం లేదని తెలిపారు. పేదింటి ఆడ పిల్లకు పెళ్లి చేస్తే ఆర్థిక సహాయం అందించాలని గత ప్రభుత్వాలు ఏవి కూడా ఆలోచించలేదు అని కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి కళ్ళెదుట కనిపిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కుడుముల సత్యం, జడ్పిటిసి ఉష గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ నర్సింలు, మునిసిపల్ కౌన్సిలర్స్, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల, టౌన్ తెరాస పార్టీ అధ్యక్షులు, అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.