రూరల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ శివారులో కాకతీయ సాండ్‌ బాక్స్‌ వారు ఏర్పాటుచేసిన రూరల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయ సాండ్‌ బాక్స్‌ నుండి చాలా ప్రాజెక్టులు చేయడం వ్యవసాయం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, విద్య అందులోనూ రూరల్‌ ఏరియాలో బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని వాటి కోసం ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

మనవాళ్లు పెద్దల మాట చద్దిమూట అని ఎప్పుడో అన్నారని, ఈ రోజుల్లో డెవలప్‌మెంట్‌ అంటే వ్యక్తి తాను ఎదగాలనే దాంట్లో వ్యాల్యూస్‌ అన్ని మరిచిపోతూ సమాజానికి ఏమి చేస్తున్నామని మరిచిపోతూ పరుగెత్తుతున్నా అందులో అన్నిటిని వదులుకుంటూ ఆరోగ్యాన్ని, ఫ్యామిలీ రిలేషన్స్‌, సోషల్‌ రిలేషన్స్‌, అన్నిటినీ వదులుకుంటూ ముందుకు పరిగెత్తుతున్నారని పేర్కొన్నారు.

విద్య, బుద్ధి ఈ రోజుల్లో సమాజంలో చాలా అవసరమని ఎందుకంటే విద్య అనేది స్కూల్లో నేర్చుకుంటాం కానీ బుద్ధి అనేవి చాలా అవసరం అన్నారు. విద్య మాత్రమే ఉండి బుద్ధి లేని వ్యక్తి సమాజానికి ఉపయోగ పడొచ్చు పడకపోవచ్చు కానీ బుద్ధి ఉన్న వ్యక్తి విద్య లేకపోయినా తప్పకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అవుతాడు కాబట్టి విద్య, బుద్ధి అనేది చాలా ముఖ్యం అన్నారు. ఈరోజు కాకతీయ సాండ్‌ బాక్స్‌ నుండి తప్పకుండా అట్లాంటి సర్వీస్‌ డెలివరీ అవుతుందని నేను అనుకుంటున్నాను అన్నారు.

వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం వ్యవసాయంలో తీసుకోవలసిన పాటించాల్సిన టెక్నిక్స్‌ నేర్పడం అనేది నిజామాబాద్‌ లాంటి జిల్లాలో చాలా అవసరం ఎందుకంటే జిల్లాలో 70 నుండి 80 శాతం ప్రజలు వారు వ్యవసాయం మీద ఆధారపడిన వారు అందులోనూ రెండు నుండి మూడు సంవత్సరాలలో చాలా మార్పులు రావడం జరిగిందని, నిజామాబాద్‌ రైతులు ఎక్కువగా వరి పండిస్తున్నారని వరి అవసరమే కానీ అవసరం అయినంత మేరకే మంచిది కానీ మరీ ఎక్కువ పండిస్తే అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రతి సీజన్లో వరి ధాన్యాన్ని కొంటుంది, 1100 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఉత్పత్తి పెంచడంతోపాటు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను పండిరచాలన్నారు. డిమాండ్‌ ఉన్న పంటను రైతులు పండిరచే విధంగా తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిజామాబాదులో ఉన్న ప్రతి రైతు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఉత్పత్తి పెరగాలి అదే టైంలో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంట పండిరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్త్రీలకు సంబంధించిన ప్రాజెక్టులో గర్భిణీ స్త్రీలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవిధంగా అవగాహన కల్పించడం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇస్తూ సొంతంగా వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ప్రోత్సహించడం 25 నుండి 30 వేల రూపాయల వరకు మంచి శాలరీ పొందే విధంగా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దాలనీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

కరోనా వల్ల ప్రతి సెక్టార్‌లో కొంత ఇబ్బంది ఉంది రానున్న రోజుల్లో ఇకముందుకు వెళ్లే విధంగా ప్రభుత్వం నుండి కాకతీయ సాండ్‌ బాక్స్‌ నుండి ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దినేష్‌ రెడ్డి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు రాజీవ్‌ వాణి, సుజిత్‌, శ్రావ్య రెడ్డి, ప్రకాష్‌ రెడ్డి, కె6 సీఈఓ దినేష్‌ సింగ్‌, డైరెక్టర్‌ రామ్‌ రెడ్డి, డోనార్‌ కాకతీయ సౌండ్‌ బాక్స్‌ సర్పంచ్‌, ఎంపీటీసీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »