కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే 1.11.2021 నుంచి 30.11.2021 వరకు బూత్ లెవల్ అధికారులకు తెలిపి సరిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
నవంబర్ 1న ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సిడి, పెన్ డ్రైవ్ ద్వారా జాబితాలను ఇస్తామని కలెక్టర్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ విషయాన్ని అంగీకరించారు. కార్యక్రమంలో ఆర్డివో రాజా గౌడ్, సూపరిండెంట్ సరళ, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, సీనియర్ సహాయకులు రవికుమార్, ఐటీ సహాయకులు నరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.