కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాలు ఈ నెల 30 లోగా 80 శాతం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని అధిగమించే విధంగా ఐకేపీ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఐకెపి అధికారులతో మాట్లాడారు.
అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘాలకి బ్యాంకు రుణాలు ఇప్పించాలని సూచించారు. శ్రీనిధి రుణాల లక్ష్యాన్ని ఈ నెల 30 లోగా 60 శాతం అధిగమించే విధంగా చూడాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఆరోగ్యం, పోషణ వంటి అంశాలపై చర్చ జరపాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఐకెపి అధికారులు పాల్గొన్నారు.