కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని కోరారు.
ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరోనా లక్షణాలున్న విద్యార్థులను గుర్తించి ప్రతి పరీక్ష కేంద్రంలో రెండు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, హైపవర్ కమిటీ ప్రతినిధులు, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.