నిజామాబాద్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు అన్ని పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఉన్నత విద్య అధికారులు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రఘురాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డిఐ ఈఓ మాట్లాడుతూ జిల్లాలోని డెబ్భై ఒక (71) పరీక్ష కేంద్రాలలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్ష నిర్వహణ సామాగ్రి సమకూర్చుకోవడం, పరీక్షా కేంద్రాల సానిటైసన్, మంచినీటి వసతి, పరీక్ష కేంద్రాల పరిసరాలలో అనారోగ్య వాతావరణం లేకుండా చూడడం అందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకునేలా చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్‌మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని రఘురాజ్ తెలిపారు.
గురువారం సెట్ ఏ ప్రశ్నా పత్రాల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో నిక్షిప్తం చేయడం జరిగిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రవికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.