నాణ్యమైన ధాన్యాన్నే తీసుకురావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు తెచ్చిందని, రైతులు నాణ్యమైన ధాన్యాన్నే తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు శాసనసభ వ్యవహారాలు హౌసింగ్‌ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి రైతు సోదరులను కోరారు. గురువారం వేల్పూర్‌ మండల కేంద్రంలో పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తన సొంత గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మన పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకున్నా ఇక్కడ రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వరికి మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 ఇచ్చే విధంగా ఇవాళ నిజామాబాద్‌ జిల్లాలో 467 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించు కోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటకలో అక్కడి రైతులు 12వందలు 13 వందల రూపాయలకు పోటీలు పడి షావుకార్లకు ధాన్యం అమ్ముకుంటున్నారని, వరి ధాన్యాని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. కానీ మన ముఖ్యమంత్రి రైతులకు మద్దతు ధర ఇప్పిస్తున్నారన్నారు. దార్శనికతతో రైతుల పక్షాన నిలబడి రైతుల మీద ప్రేమ ఉంటే ఎట్లా ఉంటుందో దీనిని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు. రైతాంగానికి స్నేహపూర్వకంగా చేతులు జోడిరచి మరీ మనవి చేస్తున్నానని దయచేసి ఎఫ్‌ఏక్యూ కలిగిన నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురండని రైతులను కోరారు. ఇది ఎఫ్‌సిఐ నిబంధన అని, తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.

కొంచెం పచ్చి మీద కోత కోయండి వరి కోసేటప్పుడు ఉన్నటువంటి హార్వెస్టర్‌లో ఉన్న ఫ్యాన్‌ ఆన్‌ చేయించండి ఫ్యాన్‌ నడిస్తే చాలు తాలు ఎగిరి పోతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలి ఎఫ్‌సిఐ విధించిన నిబంధనలకు లోబడి తేమ శాతం ఉండి తాలు లేని దాన్ని తెస్తే కిలో కూడా తరుగు తీయకుండా చూసే బాధ్యత నాది అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడితే ముఖ్యమంత్రి ఢల్లీికి వెళ్లి మూడు రోజులు అక్కడే ఉండి ప్రధానిని కేంద్ర మంత్రులను కలిసి అందరిని ఒప్పించి మళ్లీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టిన అవకాశాన్ని దుర్వినియోగం కానీయవద్దని ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అందరిని కోరుకుంటున్నానని తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్న రెడ్డి, డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేశ్రెడ్డి, సర్పంచ్‌ తీగల రాధా జెడ్‌పిటిసి భారతీ రాణి ఎంపిటిసి మొండి మహేష్‌, ఎంపీపీ జమున, డిసిఓ సింహాచలం, డిఎఓ గోవింద్‌, డిసిఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డిఎం సివిల్‌ సప్లై అభిషేక్‌ సింగ్‌, డిఓ శ్రీనివాస్‌ అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »