పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఉదయం నిజామాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం నిర్వహించగా ఇప్పటివరకు విధినిర్వహణలో భాగంగా అసువులు బాసిన పోలీస్‌ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ విధినిర్వహణలో దేశం కోసం, రాష్ట్రం కోసం పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణ చేస్తూ తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్‌ అమరవీరులను స్మరించుకునే రోజు అక్టోబర్‌ 21న అని, అది మనం అందరం గర్వించదగ్గ విషయం అని, సిబ్బంది అన్నివేళలా సమయం ఇస్తారు, శక్తి ,నిబద్ధత ఇస్తారు, చివరకు వారి అమూల్యమైన ప్రాణాలను కూడా త్యాగం చేస్తారని, సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షించినప్పుడు అభివృద్ధి సాధ్యపడుతుందని, సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం పోలీసు అధికారులు, పోలీస్‌ సిబ్బంది ఎల్లవేళలా (24 గంటల పాటు) కృషి చేస్తున్నారని, అన్ని విషయాలలో పోలీస్‌ సిబ్బంది ముందు ఉంటారని, వారి ప్రాణ త్యాగాల వలన ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు.

మహనీయుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సంస్మరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి పోలీసు తమ విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముందుంటారని, 1959 అక్టోబర్‌ 21న విధి నిర్వహణలో ఉన్న పదిమంది సి.ఆర్పీ.ఎఫ్‌ జవాన్లను లడక్లోని అక్షయ్చీన్‌ వద్ద, చైనా ఎదురుదాడిలో అసువూలు భయడంతో అప్పటి నుండి ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడం జరుగుతుందన్నారు.

దేశంలో అసాంఘిక శక్తుల ద్వారా అసువులు బాసిన అమరవీరులు ఈ సంవత్సర కాలంలో దేశంలో మొత్తం 377 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో అడిషనల్‌ ఎస్పీ 1, డీఎస్పీలు 4, సి.ఐలు 11, ఎస్‌.ఐ.పీలు 32, ఏ.ఎస్సైలు 59, హెడ్‌ కానిస్టేబుల్‌ 82, కానిస్టేబుల్స్‌ 182, హోంగార్డ్స్‌ 6, మంది అమరులైనారన్నారు.

నిజామాబాద్‌ జిల్లా, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1987 సంవత్సరం నుండి నేటి వరకు 24 మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలను కోల్పోయారని, అమరులైన వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరం విధులు గౌరవ ప్రధంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ చిత్ర మిశ్రా మాట్లాడుతూ విధినిర్వహణలో అమరులైన పోలీసులకు స్ఫూర్తి, విలువలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే శాంతి భద్రతలు ముఖ్యమని, దేశం కోసం సైనికులు తమ అమూల్యమైన ప్రాణాలను విధినిర్వహణలో ప్రాణత్యాగం చేస్తున్నారని, సమాజంలో అంత గొప్ప త్యాగనిరుక్తి కలిగి విధినిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన అమరవీరులను స్మరించుకోవాలని, అదేవిధంగా సమాజ శ్రేయస్సుకై ప్రతి ఉద్యోగి సమాజంలో బాధ్యతగా మెలగాలని, అమరుల ఆశయసాధనలో సాధించే దిశగా ముందుకు వెళ్లాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ, నేరాల నియంత్రణకు సీ.సీ కెమెరాల ఉపయోగం, సిసిటిఎన్‌ఎస్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

అనంతరం ఏడాది కాలంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 377 మంది సిబ్బందికి పేరుపేరునా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి, పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించి, వారి ఆత్మశాంతికై అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

అనంతరం అమర వీరుల కుటుంబాలకు, కరోన వల్ల మృతిచెందిన పోలీస్‌ కుటుంబాలకు గిఫ్ట్‌ ప్యాకేజీలు పోలీస్‌ కమిషనర్‌ చేతులమీదుగా ఇచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎస్‌.పి ఎన్‌.శ్వేత, ఐ.పీ.ఎస్‌., డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వి.అరవింద్‌ బాబు, అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉష విశ్వనాథ్‌ తిరునగరి, అదనపు డి.సి.పి (ఏఆర్‌) పి. గిరిరాజ్‌, కామారెడ్డి అదనపు ఎస్పి (అడ్మిన్‌) అనోన్య, నిజామాబాద్‌, ట్రాఫిక్‌ ఏ.సీ.పీలు, ఏ. వెంకటేశ్వర్లు, ఆర్‌ .ప్రభాకర్‌ రావు, కామారెడ్డి ఏ.ఆర్‌ డి.ఎస్‌.పి హృదయ కృష్ణ, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ రాఘవేంద్ర, ప్రసాద్‌, సి.ఐ.పీలు, ఎస్‌.ఐ.పిలు 1,2,3,4,5,6, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ శేఖర్‌ ,ఎం.టి.ఓ శైలందర్‌, హోంగార్డ్స్‌ రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ అప్పలనాయుడు, పోలీస్‌ సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »